సుబ్బయ్యమ్మపేట మాజీ సర్పంచ్ బొండా శ్రీనుబాబు కుటుంబాన్ని పరామర్శించిన జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా, గండేపల్లి, జగ్గంపేట: జూన్ 29 అక్షర ఆయుధం ప్రతినిధి గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట మాజీ సర్పంచ్, గండేపల్లి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు బొండా శ్రీనుబాబు తండ్రి తాతారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.సోమవారం జగ్గంపేట శాసనసభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ బొండా శ్రీనుబాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. తాతారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా తాళ్లూరు గ్రామానికి చెందిన గురిజాల వీర వెంకట రామారావు మరణించడంతో వారి కుటుంబాన్ని, జగ్గంపేట మండల జనసేన అధ్యక్షుడు మరిసే రామకృష్ణ కుమార్తె ఆరాధ్య మరణించడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, పైడిపాల సూరిబాబు, పైని వెంకటేశ్వరరావు, శిలామంతుల వీరబాబు, కొండ్రు అప్పలరాజు, సింగులూరి రామ్ దీపు, పంచికట్ల రామకృష్ణ, ఉలిసి ఐ రాజు, గొల్లవిల్లి అన్నవరం, అప్పాన వీరబాబు, గొల్లవిల్లి అప్పలరాజు, గొల్లవిల్లి రాజు సుబ్బయ్యమ్మపేట, తాళ్లూరు, వెంగయమ్మపురం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.