జిలుగు సాగు రైతులకు ఎంతో మేలు వ్యవసాయ విస్తరణ అధికారి గోపీనాథ్*

June 22, 2026 | తెలంగాణ

వలిగొండ జూన్ 22 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : జిలుగు సాగు రైతులకు ఎంతో మేలని వ్యవసాయ విస్తరణ అధికారి టి గోపీనాథ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో జీలుగ,పెసర(పచ్చిరొట్ట)సాగు చేస్తున్న తుమ్మల.శ్రీనివాసరెడ్డి, కీసరి.పాండురంగారెడ్డి రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీలుగ సాగు 50 % పూత దశలో భూమిలో కలిపిదున్నడం వలన కలిగే ప్రయోజనాలను (భూసారం పెరగడం,నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, పోషకాల లభ్యత,నత్రజని స్థిరీకరణ,సేంద్రీయ కర్బనం పెరగడం,పాక్షిక చౌడు క్షీణత) గురించి రైతులకు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper