టిడిపి యువనేత మండపాక శ్రీ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 22: అక్షర ఆయుధం ప్రతినిధి : జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకులు మండపాక శ్రీ బాబు తండ్రి మండపాక సూర్యనారాయణ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం సూర్యనారాయణ మూర్తి దశదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై సూర్యనారాయణ మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ బాబు కుటుంబాన్ని, వారి సోదరి అనిత కామిరెడ్డి చక్కర్రావులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, మండపాక వెంకటేశ్వరరావు, మండపాక పాపారావు, అడబాల నందీశ్వరరావు, మండపాక వీర సూర్య చక్ర రావు, మండపాక బాపన్న దొర, తదితరులు పాల్గొన్నారు.