వేలేరుపాడు లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న నాయకులు అధికారులు

June 21, 2026 | తెలంగాణ

అక్షర ఆయుధం న్యూస్ జూన్ 21 వేలేరుపాడు (రిపోర్టర్ రవి)అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వేలేరుపాడు మండలంలో శివకాశి పురం లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన “యోగ డే ” కార్యక్రమంలో మండల అధికారులు,పోలీస్ శాఖ ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొని యోగాని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, కరుటూరి రాధాకృష్ణ,, కోటిపల్లి ముత్యాలరావు, తాళ్లపూడి హరిబాబు, బెతి శ్రీను, కురిమెళ్ళ కృష్ణ, కుక్కునూరు సత్తిబాబు, ఎండి నఖీమ్, అనిల్ పాల్గొని యోగా చేయటం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper