అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి -ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

June 18, 2026 | తెలంగాణ

అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి- ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

వలిగొండ జూన్ 17 అక్షర ఆయుధం ప్రతినిధి ;మండల కేంద్రంలోని అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి భాస్కర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాల చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలో బుక్స్, యూనిఫామ్ తదితర వస్తువుల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారు మండిపడ్డారు వెంటనే ప్రవేటు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలని మండల విద్యాధికారికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు *ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మారోజు నరసింహాచారి, ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు సూరారం కళ్యాణ్, ఏఐఎస్ఎఫ్ మండలం నాయకులు బాలగోని మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper