ఎల్లమ్మ పట్నాల సందర్భంగా వైభవంగా పోచమ్మ బోనాలు

May 10, 2026 | సినిమా వార్తలు

అక్షర ఆయుధం న్యూస్ మే 10. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ పంజాల సతీష్: జన్నారం మండల పరిధిలోని కవ్వాల్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి పట్నాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నాల అలంకరణ లో భాగంగా ఆలయ ప్రాంగణంలో రంగు రంగుల ముగ్గులతో ఎల్లమ్మ తల్లి పట్నాలను తీర్చిదిద్దారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో కవ్వాల్ గ్రామం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.బోనాల ఊరేగింపులో మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన పెట్టుకుని, మంగళహారతులతో గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తరలివచ్చారు. గ్రామ దేవత పోచమ్మకు నైవేద్యం సమర్పించి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.నైవేద్యం & మొక్కులతో భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి, తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు.గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పట్నాల పండుగతో కవ్వాల్ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది

🌐 Select Language:
📰 ePaper