మత్యాద్రి నూతన ఈవోగా వెంకటయ్య

June 16, 2026 | తెలంగాణ

వలిగొండ జూన్ 16 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : మండల పరిధిలోని వెంకటాపురంలో గ్రామంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రమైన మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన కార్యనిర్వాహణాధికారిగా కొత్తపల్లి వెంకటయ్య గ్రేడ్1 మంగళవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అర్చక సిబ్బంది స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper