సింగరేణికి హెల్త్ సబ్ సెంటర్ మంజూరుకు చర్యలు ప్రారంభం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ మేదరి టోనీ

June 12, 2026 | తెలంగాణ

అక్షర ఆయుధం న్యూస్, జూన్ 13,ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం (వి . బన్సిలాల్): సింగరేణి గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామంలో ప్రత్యేక హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యే గౌరవ శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారికి సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) వినతిపత్రం సమర్పించారు.గ్రామంలో ప్రత్యేక హెల్త్ సబ్ సెంటర్ భవనం లేకపోవడంతో ప్రజలు వైద్య సేవల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భరత్ నగర్ కాలనీలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సంబంధిత అధికారులతో చర్చించి, సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ అవసరాన్ని గుర్తిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు (డీఎంహెచ్‌ఓ) ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.ప్రజల ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చొరవ అభినందనీయమని సర్పంచ్ మేదరి టోనీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృషితో త్వరలోనే సింగరేణి గ్రామానికి హెల్త్ సబ్ సెంటర్ మంజూరై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సింగరేణి గ్రామ ప్రజల తరఫున తమ విజ్ఞప్తిని స్వీకరించి వెంటనే చర్యలు చేపట్టిన వైరా ఎమ్మెల్యే గౌరవ శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper