కాకినాడ జిల్లా గండేపల్లి, జూన్ 23: అక్షర ఆయుధం ప్రతినిధి : గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాశ్వత పరిష్కారం చూపారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, చెరువుగట్టుపై ఉన్న బోరు నుండి పైపులైన్లు ఏర్పాటు చేసి గ్రామంలోని జిఎల్ఆర్ ట్యాంకుకు నీటిని పంపించే ఏర్పాటు పూర్తయింది. అక్కడి నుండి గ్రామం అంతటా తాగునీటి సరఫరా ప్రారంభమైంది.సమస్యను తెలిపిన 10 రోజుల్లోనే పూర్తిస్థాయిలో పరిష్కరించిన నాయకుడు జ్యోతుల నెహ్రూ అని, పనిచేసే నాయకుడు అంటే ఆయనే అని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ( య ల్లమిల్లి సీఎం), మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ, దేవిశెట్టి బాబ్జి, కలిపే శేషయ్య, మాదిరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.