Header
05 Nov 2026 | 03:53 PM

విజయవంతంగా ఎక్స్‌పోజర్ విజిట్ శిక్షణ కార్యక్రమం

అక్షర ఆయుధం అక్టోబర్:6 రిపోర్టర్( బుయ్యన శ్రీను )జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కుక్కునూరు మండలంలోని కివ్వాక గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్ వద్ద ఎక్స్‌పోజర్ విజిట్ శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో నాగరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో నాగరాజు మాట్లాడుతూ మండలంలోని సుమారు 30 మంది గ్రీన్ అంబాసిడర్లు, పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వర్మీ కంపోస్ట్ తయారీ విధానం, తడి–పొడి చెత్తను వేరు చేయడం, ప్రతిరోజూ గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.అలాగే సేకరించిన చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు తరలించి, తడి చెత్తను వినియోగించి వర్మీ కంపోస్ట్‌ను శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో ప్రత్యక్షంగా వివరించినట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నరసింహారావు, పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు