శ్రీ ప్రజ్ఞ స్కూల్స్ చైర్మన్ బండారు నాగబాబు* *కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూన్ 26:* అక్షర ఆయుధం ప్రతినిధి బకిం చంద్ర చటర్జీ 189వ జయంతి వేడుకలను శ్రీ ప్రజ్ఞ స్కూల్స్ చైర్మన్ బండారు నాగబాబు ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ విద్యాసంస్థలలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తొలుత చటర్జీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి చైర్మన్ నాగబాబు, డైరెక్టర్ తుమ్మల శ్వేత ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ — "1838 జూన్ 26న జన్మించిన బకిం చంద్ర చటర్జీ అక్షరాన్ని ఆయుధంగా మలిచిన మహనీయుడు. 'వందేమాతరం' అనే రెండు అక్షరాలతో నిద్రాణమైన భారత జాతిని మేల్కొలిపిన దార్శనికుడు ఆయన." "వందేమాతరం నినాదం వినపడితే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టేది. లాఠీ దెబ్బలు, కారాగారాలు సైతం ఆ నినాదపు ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. స్వాతంత్ర్య సమరంలో అది ప్రతి భారతీయుడి ఊపిరిగా మారింది." "నేటి విద్యార్థి లోకం చటర్జీ సాహిత్యాన్ని చదవాలి. దేశభక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, అది బాధ్యత. అందుకే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 'వందేమాతరం' గీతాలాపన తప్పనిసరి. ఎందరో త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి." కార్యక్రమంలో డైరెక్టర్ తుమ్మల శ్వేత, ప్రిన్సిపాల్ అభి, ఇంచార్జి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని చటర్జీకి నివాళులు అర్పించారు.