Header
05 Nov 2026 | 03:45 PM

వలిగొండలో బతుకమ్మ ఏర్పాట్లు షురూ

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ, అక్టోబర్ 10* తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలకు వలిగొండలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం మండల కార్యదర్శి ఎస్.కె. రసూల్ బతుకమ్మలు నిమజ్జనం చేసే కాల్వ వద్ద జెసిబి తో పనులు పనులను ప్రారంభించారు. బతుకమ్మ ఆటల కోసం వేదిక, లైటింగ్, మహిళలకు సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ దంతూరి అరుణ్ కుమార్, గ్రామపంచాయతీ కారోబార్ సూరారం మధు, పోలేపాక రాజు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.