Header
05 Nov 2026 | 03:46 PM

వలిగొండ లో PACS అర్ధ వార్షిక సర్వ సభ్యసమావేశం

ఆదాయ వ్యయాలు, బకాయిలపై సమీక్ష*

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ, సెప్టెంబర్ 29: వలిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) అర్ధ సంవత్సర సమావేశం బుధవారం నిర్వహించారు. PACS చైర్మన్ గరిసె రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత ఆరు నెలల ఆదాయ వ్యయాలు, బకాయిల వివరాలు, రైతులకు ఇచ్చిన రుణాలు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా చైర్మన్ గరిసె రవి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే PACS లక్ష్యమని, రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడంలో PACS ముందుంటుందని అన్నారు. బకాయిలు ఉన్న రైతులు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు. సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో PACS డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గత అర్ధ సంవత్సరంలో జరిగిన ఖర్చులు, వసూలైన బకాయిలు, ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వివరాలను CEO వివరించారు. రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, డైరెక్టర్లు, స్థానిక సర్పంచ్ కుంభ వెంకట్ పాపిరెడ్డి,మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, పాశం సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ మలుగ మాధవి, బత్తిని లింగయ్య, చెరుకు శివయ్య,వలిగొండ రైతులు తదితరులు పాల్గొన్నారు.