సిర్పంగి స్వామి
సిపిఎం మండల కార్యదర్శి
వలిగొండ జూన్ 17 ప్రజా ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా వెంటనే మార్చాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
బుధవారం రోజున మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదివేల జనాభా కలిగిన వలిగొండ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేవలం ఎనిమిది పడకల ఆసుపత్రిగా ఉండటం వల్ల సరైన వైద్య సేవలు అందక పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెంటనే వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే ఉన్నారని వెంటనే రెండవ మెడికల్ ఆఫీసర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే రోగులకు మందులు ఇవ్వడానికి ఫార్మసిస్ట్ లేరని వెంటనే ఖాళీగా ఉన్న ఫార్మాసిస్ట్ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాత్రి వాచ్మెన్ కు ప్రభుత్వం నుండి సక్రమంగా జీతాలు రాకపోవడంతో వారు బయటికి వెళ్లిపోయారని వెంటనే రెగ్యులర్ వాచ్మెన్ నియమించి వారికి సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూత్రశాలల్లో సరైన నీటి వసతి లేక స్కావెంజర్ లేకపోవడంతో తీవ్రమైన దుర్గంధంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వలిగొండ సబ్ సెంటర్ కు నూతన భవనాన్ని నిర్మించాలని ఖాళీగా ఉన్న ఏఎన్ఎం మరియు మూడు ఆశా కార్యకర్తల పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు కొండూరు సత్తయ్య,ధ్యానబోయిన యాదగిరి, ప్రజలు యాదమ్మ, అమృతమ్మ, నరసింహ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.