05 Jul 2026 | 02:27 PM

ట్రాక్టర్లును ఢీకొన్న లారీ ఇద్దరికి గాయాలు

అక్షరం ఆయుధం న్యూస్:( రిపోర్టర్ కృష్ణ) జూన్ 4న రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం మండలం లో వడ్ర వన్నూరు గ్రామ సమీపంలో రాయదుర్గం అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్, (25)బాలు (13)అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వడ్రవన్నూర్ గ్రామానికి చెందిన విజయ్ బాలు చెరువుల మట్టి ట్రాక్టర్లు లోడ్ చేసుకొని గ్రామ సమీపంలో రైతు పొలంలో అన్లోడ్ చేసి తిరిగి ట్రాక్టర్లు జాతీయ రహదారిపై పక్కన నీల పెట్టారు. రాయదుర్గం నుంచి అనంతపురం వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఇద్దరిని రాయదుర్గం హాస్పిటల్ కి తరలించారు పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ అనంతపురం ఆస్పత్రికి రేపర్ చేశారు. సీఐ జయ నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper