అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 8 వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మత్యాద్రి ఆలయ మాజీ డైరెక్టర్ కసిర బోయిన లింగయ్య యాదవ్ స్థానిక త్రీశక్తి ఆలయంలో గురువారం నిత్య నైవేద్య సమర్పణ సమయంలో వినియోగించేందుకు అమ్మవారికి 55 కిలోల గంటను లింగయ్య అరుణ దంపతులు సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఇటువంటి ప్రాచీన ఆగమన సాంప్రదాయాలను కాపాడడం వల్ల దేవాలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని అభిప్రాయపడ్డారు. అమ్మవారి అనుగ్రహంతో నిత్యం ఈ గంట నాదాన్ని నైవేద్య సమయంలో విన్న భక్తులకు సర్వ మంగళాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక బృందం మరియు నిర్వాహకుడు చిరంజీవి మణినందన్, కుమారి రిషిక పాల్గొన్నారు.