05 Jul 2026 | 12:54 PM

నకిలీ విత్తనాలను అరికట్టాలి

లైసెన్స్ లేని విత్తనాల షాపులపై చర్యలు తీసుకోవాలి సిపిఎం డిమాండ్

వలిగొండ జూన్ 10 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : లైసెన్స్ లేకుండా విత్తనాల విక్రయాలు చేపడు తున్న షాపులపై వెంటనే చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు. బుధవారం రోజున సిపిఎం మండల కమిటీ సభ్యుల- శాఖ కార్యదర్శుల ప్రజా సంఘాల మండల అధ్యక్ష కార్యదర్శులు సమావేశం సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న బాలరాజు రాజయ్య స్వామీలు మాట్లాడుతూ గత పంటలో నకిలీ విత్తనాల వల్ల రైతులు పెద్ద ఎత్తున దాన్యంలో తాలువచ్చి మోస పోవడంతో పాటు నష్టపోయారని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తనాల షాప్ ల వల్ల రైతులకు ఈ పరిస్థితి వస్తుందని లైసెన్సు లేని షాపులపై వెంటనే తహసిల్దార్ మరియు ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అనేక విత్తనాల షాపుల్లో నకిలీ విత్తనాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తున్న వారిపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుత సీజన్ కు రైతులకు పురుగుమందులు మరియు సరిపడా ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీలో అందే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి గణపతి రెడ్డి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందడి సత్తిరెడ్డి, మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు, రామచందర్, దుబ్బ లింగం,కవిడే సురేష్, బూడిద మనమ్మ, నాయకులు దొడ్డి బిక్షపతి,కొండూరు సత్తయ్య,చేగురి నగేష్,కొమ్ము స్వామి, ఎటెల్లి నరసింహ,వేముల అమరేందర్, ధ్యానబోయిన యాదగిరి,రుద్రపళ్లి లింగయ్య,దండు వేణు,తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper