Header
05 Nov 2026 | 03:49 PM

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్అక్టోబర్ 7 :నేటి డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. రవి సూచించారు.బుధవారం పట్టణ కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి OTP, బ్యాంక్ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని తెలిపారు.ఆన్లైన్ లో డబ్బులు పంపే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, ఉచిత బహుమతులు, లాటరీ తగిలిందని వచ్చే మెసేజ్ లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.