Header
05 Nov 2026 | 03:53 PM

సైబర్ మోసాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 6 భువనగిరి*యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలను సైబర్ మోసాల నుంచి అప్రమత్తం చేయడంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సైబర్ ఫ్రాడ్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలియని లింకులు క్లిక్ చేయడం, OTP, PIN, CVV వంటి బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోవడం చేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్, KYC, ఫేక్ పోలీస్ కాల్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.“మోసగాడి మాట నమ్మితే నష్టం.. అప్రమత్తంగా ఉంటే రక్షణ!” అని పేర్కొంటూ, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.