05 Jul 2026 | 12:53 PM

రామవరంలో రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు పంపిణీ – పారదర్శక పాలనకు నిదర్శనం: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట, జూలై 4: ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా, పూర్తి పారదర్శకతతో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శనివారం రైతులకు రాజ్యముతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో 1408 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1643 పాస్ పుస్తకాలకు గాను 1408 పంపిణీ పూర్తయింది. మిగిలిన 235 పుస్తకాలను సాంకేతిక కారణాల పరిశీలన అనంతరం వారం రోజుల్లో అందిస్తామని ఎమ్మార్వో జేవిఆర్ రమేష్ తెలిపారు.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు:"ప్రభుత్వ పథకాలు, పత్రాలు వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా ఉండాలి. రాజముద్ర అనేది వ్యవస్థకు చిహ్నం. అందుకే ఈ మార్పు.""గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ తన వ్యక్తిగత ఫోటోలు ముద్రించి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతాంగంలో అభద్రత సృష్టించారు. దాని ఫలితాన్ని ప్రజలు ఎన్నికల్లో చూపించారు.""ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం స్పష్టం - రైతు భూమికి సంపూర్ణ రక్షణ, ప్రభుత్వ పరంగా పూర్తి భరోసా. అందులో భాగమే ఈ రాజముద్ర పాస్ పుస్తకాలు."రాజముద్ర తో పాటు రైతు ఫోటో జై తెలుగు తల్లి నినాదంతో జాతీయతా భావాన్ని తెలియజేశారు."రైతు సమస్యను రాజకీయం చేయడం కాదు, పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది."ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర డైరెక్టర్లు కొత్త కొండబాబు, పోతుల మోహనరావు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, మాజీ సర్పంచ్ మండపాక చిన్న, జనసేన ఎంపీటీసీ దొడ్డ శ్రీను, మండల జనసేన యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్ జగ్గంపేట ఆర్ఐ జి మంగపతి నాయుడు బాబు, టీడీపీ, జనసేన నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

    🌐 Select Language:
    📰 ePaper