Header
05 Nov 2026 | 03:53 PM

ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించిన మండల పరిషత్ అధికారి జలంధర్ రెడ్డి

అక్షర ఆయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 5 మండల ప్రజా పరిషత్ కార్యాలయం, వలిగొండలో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు నోడల్ అధికారి జి. జలంధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై, ప్రజల నుంచి సమస్యలు మరియు వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 3 దరఖాస్తులు స్వీకరించామనిప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించు కోవాలని కోరారు.