
లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేత - వృద్ధులు, వితంతువులతో ముఖాముఖి
కాకినాడ జిల్లా గండేపల్లి జూలై 1 : అక్షర ఆయుధం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు గండేపల్లి మండలం సింగరం పాలెం గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇది పెద్ద భరోసా. ఇది కేవలం ఆర్థిక సాయం కాదు - ప్రభుత్వం పేదల పక్షాన ఉందనడానికి నిదర్శనం" అని అన్నారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించిన మోహనరావు, లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. "పెన్షన్ డబ్బులు సకాలంలో అందుతున్నాయి. ఇంటికే వచ్చి ఇస్తున్నారు. మా కష్టాలు తీరినట్లయింది" అంటూ వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు."గతంలో పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే మన గుమ్మం తొక్కి సాయం అందిస్తోంది. ఇదే నిజమైన ప్రజా పాలన" అని డైరెక్టర్ పోతుల మోహనరావు పేర్కొన్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏ. నాగేశ్వరరావు,ఏ. సుదర్శనరావు, బి. చౌదరి, ఎన్. బాబ్జి, ఎన్. కొండ, కే. రమేష్,.ఏ దీపు, సాయిరామ్ స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.