Header
05 Nov 2026 | 03:49 PM

పోలీస్ సిబ్బంది ఐక్యత, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా ‘బడా ఖానా’ కార్యక్రమం

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 13 యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం భువనగిరిలోని సాయి కన్వెన్షన్ హాల్‌లో ‘బడా ఖానా’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు.విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీస్ సిబ్బందికి మానసిక ఉల్లాసం కల్పించడం, కుటుంబాలతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు.పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, నమ్మకం, సహకారంతో పనిచేయాలని, పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలని ఎస్పీ సూచించారు.సమర్థవంతమైన కమ్యూనికేషన్, పరస్పర సహకారం, సమన్వయం పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.