Header
05 Nov 2026 | 03:49 PM

పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి:- సిఐటి యు

వలిగొండ సెప్టెంబర్ 28 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల వ్యాప్తంగా 37 గ్రామ పంచాయతీ లో పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటి యు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వాలని స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు లో మార్పు రాలేద ని, వలిగొండ మండలవ్యాప్తంగా ఉన్నా 37గ్రామ పంచాయతీ లో ఉన్న 60మంది అదనపు కార్మికుల వేతనాలు 10 నెలలు పెండింగ్ లో ఉన్నాయా ని, అదేవిధంగా మల్టీ పర్పస్ కార్మికుల వేతనాలు 2నెలలు పెండింగ్ లో ఉన్నాయా ని వేతనాలు లేక కార్మికులు అనేక ఇబ్బందు ల కు గురైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకు నాడు పా రిశుద్ధ కార్మికులకు శానిటేషన్ కిడ్స్ ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు నెలలు గడుస్తున్న శానిటేషన్ కిడ్స్ ఇవ్వటం లేదని దీనివల్ల కార్మికులు అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారని వెంటనే ఇవ్వాలని అధికారులను కోరారు.గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిర్వహణ పాల్గొన్న ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయాలని వెంటనే అమలు చేయాలని అధికారులకు కోరారు. అనంతరం పై డిమాండ్ ను పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కొండే నరసింహ ఉక్కుర్తి రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి ఎల్లమయ్య మండల కమిటీ నాయకులు చూడారం మధు కందుల లింగస్వామి పావురాల శీను రాములు నీలం రాజు కోలేపాక లలిత నిర్మల శంకర్ సాయిలు స్వామి పగడం లక్ష్మయ్య అంజయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు.