Header
05 Nov 2026 | 07:45 PM

పట్టభద్రులారా.. ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండితహసిల్దార్ జి.దశరథ

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 5 వలిగొండ తెలంగాణలో ఖాళీ కానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని తహసిల్దార్ జి దశరథ పేర్కొన్నారు. గురువారం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో పట్టా బద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి న ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఓటు ఉన్నా, ప్రతిసారి కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రతి పట్ట భద్రుడు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు.