తూర్పుగోదావరి జిల్లా సీతానగరం జూన్ 20 : అక్షర ఆయుధం ప్రతినిధి సీతానగరం మండలం ఉండేశ్వరాపురం గ్రామంలో ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపెనీ ఆధ్వర్యంలో వరి బదులు ఆయిల్ పామ్ వేస్తే ప్రభుత్వ రాయితీలు, కంపెనీ సహకారంతో తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ ఆఫీసర్ పి.రిని మాట్లాడుతూ గ్రామంలో వరి సాగు ఎక్కువగా ఉందని, బోర్ల కింద వరి పొలాలను ఆయిల్ పామ్‌కు మార్చితే అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, సూక్ష్మ సేద్యం రాయితీలు, డ్రిప్ ద్వారా ఎరువులు వేయడం వల్ల లాభాలు, అంతర పంటల సాగు గురించి వివరించారు. పతంజలి ఫుడ్స్ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్,Ds శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల ప్రాముఖ్యత, రైతులకు కంపెనీ ద్వారా అందించే సేవలు, సదుపాయలు, పంటసాగులో ఎరువుల యాజమాన్యం, సులభతరమైన మెలకువలు మరియు సాగులో విజయం సాధించిన రైతుల విజయగాధలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ B. తరుణ్ సత్య సాయి, VAA K. దుర్గబాబు పామ్ ఆయిల్ కంపెనీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పామ్ ఆయిల్ రైతులు పాల్గొన్నారు.