వలిగొండ జూన్ 9 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్*వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా నియమితులైన బత్తిని సహదేవ్ గౌడ్ ని స్థానిక సర్పంచ్ కుంభ వెంకట్ పాపిరెడ్డి మంగళవారం శాలువాతో సన్మానించారు. అనంతరం సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తానని, స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఫలాలు అందేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు బత్తిని లింగయ్య గౌడ్, చెరుకు శివయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములు, చిలుగూరి సత్తిరెడ్డి,ఐటి పాముల రవీంద్ర, బత్తిని అరుణ్, జేల్లా చంద్రయ్య, బత్తిని బాల్ చెట్టి,కీర్తి రమేష్, దండ మల్లికార్జున్, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.