Header
05 Nov 2026 | 07:49 PM

మూసి వేసున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

*సిబ్బంది ఎవరులేక తిరిగి వెళ్లిన రోగులు*

*జిల్లా అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి*

*కవిడే సురేష్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు*

*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 5 వలిగొండ*వలిగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూసి వేసి ఉండటం వలన అనారోగ్యంతో ఆసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన రోగులు సిబ్బంది ఎవరు లేకపోవడం తిరిగి వెళ్లారని వెంటనే ఆసుపత్రి పైన విచారణ జరిపి సిబ్బంది పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు కవిడే సురేష్, డివైఎఫ్ఐమండల అధ్యక్షులు ద్యానబోయిన యాదగిరి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించగా ఆసుపత్రి యొక్క ప్రధాన గేటు, డోర్లు మూసి వేసి ఉన్నాయి.ఈ సందర్భంగా సురేష్,యాదగిరి లు మాట్లాడుతూ వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రోగులు వివిధ సమస్యలతో వస్తుంటారు.ఇక్కడ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు,ముగ్గురు స్టాఫ్ నర్సులు,ఒక ల్యాబ్ టెక్నీషన్,ఇద్దరు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు,అటెండర్ లు ఉన్నప్పటికీ రోగులకు వైద్యం చేయకుండా ఆసుపత్రిని మూసి వేసి ఉన్నారు.రోజు సుమారుగా మండల వ్యాప్తంగా యాబై నుండి వంద మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వారికి సరిపడా సౌకర్యాలు కూడా లేవని,ప్రభత్వ డాక్టర్లే నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులను నడుపుకుంటూ పేషంట్స్ ను ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పంపుతున్నారని అన్నారు.వెంటనే జిల్లా స్థాయి అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పైన దృష్టి పెట్టి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పెద్దబోయిన భీమరాజు,పాలోజు శంకరాచారి, వేముల నాగరాజు,మైసోళ్ల నరేందర్,రోగులు తదితరులు పాల్గొన్నారు.