అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 1 వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన తోటకూరీ నర్సింహ,చంద్రగిరి మత్స్యగిరి,పోలేబోయిన గంగయ్య,ఎలగందుల సుదర్శన్ లు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందగా చికిత్స నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తోటకూరి నర్సింహ 24 వేలు, చంద్రగిరి మత్స్యగిరి 60,000 వేలు, పోలేబోయిన గంగయ్య 26,000 వేలు, ఎలగందుల సుదర్శన్ 37 వేల రూపాయలు మంజూరైన చెక్కులను గురువారం స్థానిక సర్పంచ్ ఏర్పుల వెంకటేశం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబటి సాయికుమార్ వార్డు సభ్యులు కాడిగళ్ల రామనర్సింహ,ఏర్పుల పద్మ యాదయ్య నాయకులు షేక్ రసూల్, పులిపలుపుల రాములు,గన్నెబోయిన నర్సింహ,కోలగాని యాదయ్య,కాడిగల్ల రవి,ఇంజమూరి నాగేష్, కాడిగల్ల లింగయ్య,ఇంజమూరీ నర్సింహ,దొంతి రమేష్,పులిపలుపుల శంకరయ్య,గోనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.