05 Jul 2026 | 02:23 PM

సోమవారం ఎత్తిపోతల పథకం నుండి 1200 ఎకరాలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా కిర్లంపూడి, జూన్ 23: అక్షర ఆయుధం ప్రతినిధి :కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలోని సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ పంటలకు మంగళవారం ప్రత్యేక పూజలు చేసి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ .సోమవారం ఎత్తిపోతల పథకం చైర్మన్ జ్యోతుల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా పంపింగ్ స్కీం ప్రారంభించి సోమవరం, ఇర్రిపాక, కృష్ణవరం, బూరుగుపూడి గ్రామాలకు చెందిన 1200 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు సకాలంలో రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు. పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, ఇన్‌పుట్ సబ్సిడీ, సాగునీరు ఇలా ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం చైర్మన్ జ్యోతుల కోటేశ్వరరావు ఎమ్మెల్యే నెహ్రూ తో మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకానికి మూడు మోటర్లు పంపులు పనిచేస్తున్నాయని కానీ ఒక మోటర్ పంపు శిథిలావస్థకు చేరడంతో ఆ మోటార్ స్థానంలో కొత్త మోటర్ పంపు ఏర్పాటు చేయాలని కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తొందర్లోనే కొత్త మోటర్ పంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే నెహ్రూకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, జంపన సీతారామచంద్ర వర్మ, వీరం రెడ్డి కాశి బాబు, నీలం శ్రీను, తూము కుమార్, చదరం చంటిబాబు, కుర్ల చినబాబు, ఎత్తిపోతల పథకం చైర్మన్ జ్యోతుల కోటేశ్వరరావు, జంపన రవివర్మ, కాళ్ల వెంకటేష్, గంగిరెడ్ల దొరబాబు, మంచి కంటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper