05 Jul 2026 | 04:38 PM

మత్యాద్రికి బస్సులను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మత్స్యద్రి సీఈఓ

వలిగొండ జూన్ 16 అక్షరాయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కు యాదాద్రి భువనగిరి జిల్లా నలుమూలల నుండి భక్తుల సౌకర్యార్ధం దిల్ సుఖ్ నగర్ నుండి దేవస్థానం కొండఫైకి రెండు ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పించుటకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ సమత తన సిబ్బందితో రూట్ మ్యాప్ పరిశీలన చేస్తూ,దిల్ సుఖ్ నగర్ నుండి ప్రారంభమై ఎల్.బి.నగర్,, హయత్ నగర్,పెద్ద అంబర్ పేట్, రామోజీ ఫిల్మ్ సిటి ,కొత్తగూడెం, చౌటుప్పల్, నాగారం, వలిగొండ మీదుగా మత్స్యగిరి గుట్ట కు వచ్చుటకు పరిశీలన చేయడమైనది. బస్సులను ఏర్పాటు చేయడం ఫై నూతన కార్య నిర్వహణ అధికారి కే.వెంకటయ్య హర్షం వ్యక్తం చేస్తూ, భక్తుల సౌకర్యార్ధం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వలన దేవస్థానం వచ్చే భక్తులకే గాక చుట్టూ ప్రక్కల గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని తెలుపుతూ డిపో మేనేజర్ సమతకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper