Header
04 Nov 2026 | 02:19 PM

మరణించిన గొర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి వేల్పుల

అక్షర అయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 01 మంగళవారం బీబీనగర్ ప్రాంతంలో రైలు ప్రమాదంలో 350 మరణించిన గొర్లకు ప్రభుత్వం ఎక్స్గ్రేసి అందించాలని జిల్లా గొర్ల పెంపకం దారుల యూనియన్ మాజీ ఉపాధ్యక్షులు, యాదవ హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బాదిత గొర్ల కాపరి కృష్ణయ్యను పరామర్శించి అనంతరం ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన గొర్రెల వలన కాపరికి సుమారు 50 లక్షల నష్టం వాటిల్లిందని, నష్టపోయిన గొర్ల కాపరికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, పూర్తి సబ్సిడీతో బాధిత గొర్ల కాపరికి 350 గొర్రెలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి గొర్ల కాపరికి ఇన్సూరెన్స్ తో పాటు గొర్లకు ఉచిత ఇన్సూరెన్స్ అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.