05 Jul 2026 | 02:34 PM

ప్రారంభానికి పూర్తిస్థాయిలో సిద్ధమైన మామిడాడ జ్యోతుల పాపారావు సాగునీటి పథకం

*రైతులతో కలిసి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*కాకినాడ జిల్లా,

జగ్గంపేట జూన్ 25: అక్షర ఆయుధం ప్రతినిధిజగ్గంపేట మండలం మామిడాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులను గురువారంఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.*రైతు పక్షపాతి చంద్రబాబు* జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నాకు జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చి రైతును ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నంత కాలం పొలాలకు నీటి కరువు రాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని, రైతులకు సాగునీరు అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.*మూడు కోట్ల యాభై లక్షలతో పనులు పూర్తి*మామిడాడ, ఇర్రిపాక , మర్రిపాక, గొల్లలగుంట, నరేంద్రపట్నం గ్రామాల రైతుల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీర్చేందుకు జిల్లా ఖనిజ నిధి ద్వారా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో పథకం పనులు పూర్తి చేశామన్నారు. కాలువలు, మోటార్లు, పైపులైన్ల పనులన్నీ వంద శాతం పూర్తయ్యాయని, ట్రయల్ రన్ కూడా విజయవంతమైందని తెలిపారు.*తొందరలోనే నీళ్లు విడుదల*పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని, తొందరలోనే ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఖరీఫ్ నుంచే ఐదు గ్రామాల్లోని రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని, బీడు భూములు సైతం పచ్చగా మారుతాయని భరోసా ఇచ్చారు.*రైతు చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యం*"ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం రైతు సంక్షేమం. రైతు కన్నీరు తుడవడం, పొలం తడపడం తప్ప కూటమి ప్రభుత్వానికి మరో ధ్యేయం లేదు" అని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఈ పథకంతో వేలాది రైతు కుటుంబాలకు నేరుగా మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, క్లస్టర్ ఇంచార్జి బస్వా చినబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు, నీటి సంఘం చైర్మన్ జ్యోతుల ఈశ్వరరావు, జ్యోతుల సత్యమూర్తి, మామిడాడ, ఇర్రిపాక గ్రామాల రైతులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.*పథకం ముఖ్యాంశాలు:*- *లబ్ధి గ్రామాలు*: మామిడాడ, ఇర్రి పాక , మర్రిపాక, గొల్లలగుంట, నరేంద్రపట్నం - *మొత్తం నిధులు*: మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు- *నిధుల వనరు*: జిల్లా ఖనిజ నిధి- *ఆయకట్టు*: రెండు వేల ఐదు వందల ఎకరాలు- *స్థితి*: పనులు పూర్తి, ప్రారంభానికి సిద్ధం

🌐 Select Language:
📰 ePaper