05 Jul 2026 | 02:25 PM

కదిలిరండి మహానాడుకు పిలుస్తున్నమండలం.కన్వీనర్ కురబహనుమంతు

అక్షర ఆయుధం న్యూస్ (రిపోర్టర్ కృష్ణ ఇన్చార్జి) 26 మే రాయదుర్గం మండలంలో రూరల్ కన్వీనర్ కురుబ హనుమంతు మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంధన పొదుపు చర్యలలోభాగంగా ఈసారి మహానాడును డిజిటల్ పద్ధతిలో నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మండలం లోని క్లస్టర్ --7 పరదిలో గల గ్రామాల లోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బిఎల్ఏలు మరియు కె ఎస్ ఎస్ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జెడ్పిటిసి లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ క్లస్టర్ 7 వేదికను వడ్రవన్నూరు గ్రామంలోని *అపలాపురం* *శ్రీఆంజనేయస్వామి* వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈనెల 27 బుధవారం 28 గురువారం తేదీలలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించే ఈ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ *పార్టీ సభ్యత్వం* *పచ్చ చొక్కాధరించాల్సిందిగా* తెలియజేస్తున్నాం. ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉదయం టిఫిన్,మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అని.మండల కన్వీనర్ కురుబ హనుమంతు తెలపడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper