అక్షర ఆయుధం న్యూస్ (జూన్ 6 రిపోర్టర్ రవి)కుకునూర్ మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ అధ్యక్షతన ముఖ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా విస్మరించారో, ఎన్నికల సమయంలో ప్రకటించిన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో–2024లోని అంశాలను ప్రజలకు గుర్తు చేస్తూ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో వివరించాలని అన్నారు.అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, రైతులు, మహిళలు మరియు పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను పారదర్శకంగా అమలు చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం వైఎస్సార్‌సీపీ పాలన ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ప్రజల ఆశీస్సులు, మద్దతుతో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తూ, పార్టీ సిద్ధాంతాలు మరియు సంక్షేమ పాలనను ప్రతి గడపకు తీసుకెళ్లే దిశగా నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని తాండ్ర రాజేష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుచ్చర్లపాటి నరసింహరాజు వేల్పుల శ్రీనివాస్ బుచ్చిబాబు రాయి మాధు ప్రవీణ్ పాముల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.