05 Jul 2026 | 01:53 PM

జగ్గంపేటలో ఘనంగా కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు…

*నివాళులర్పించిన ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు*

*కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూలై 4:* స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్యఅతిథిగా, జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు విశిష్ట అతిథిగా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కొత్త కొండబాబు మాట్లాడుతూ, 70 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బోండా నూకబాబు, మానేపల్లి బంగార్రాజు, కొత్త శ్రీరామకృష్ణ, వి నాగసత్య, బోండా వీరసత్య, కంచర్ల బాబు, మాతంశెట్టి సాయిబాబా, కంచర్ల రమాదేవి, ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper