05 Jul 2026 | 02:36 PM

జూన్ 29న సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి…సిపిఎం పిలుపు

వలిగొండ జూన్ 26 అక్షర‌‌‌ అయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ : జూన్ 29 30 తేదీల్లో మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో జరిగే సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను, జూన్ 29న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఈనెల 29,30 తేదీల్లో సుంకిశాల గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా 29వ తేదీన సుంకి శాల లో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి జహంగీర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు.ఈ శిక్షణా తరగతులకు మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ సభ్యులు 400 మంది హాజరుకానున్నారని ఈ శిక్షణా తరగతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు,మరియు స్థానిక సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా తరగతుల జయప్రదం కోసం ప్రజలు ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి పీర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, బూడిద మనమ్మ, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు కొండూరు సత్తయ్య, శీలం ఇందిర, బూడిద సైదులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper