*వలిగొండ జూన్ 24 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్*కార్మికుల అండ దండ ఉద్యోగకార్మిక సంగం సీఐటీయూ వలిగొండ మండలజనరల్ బాడీ సమావేశం రేపు వలిగొండ వ్యవసాయమార్కెట్ యార్డ్ లో నిర్వహించడం జరుగుతుంది అని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి తూర్కపల్లి సురేందర్ కార్మికుల కు పిలపునిచ్చారు.ఈ సందర్బంగా సురేందర్ మాట్లాడుతూ కేంద్రం లో ని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ ల ను తీసుకోచ్చి కార్మికుల హక్కులు ను పూర్తిగా రద్దు చేసి కార్మికుల గొంతు కోసింది అని విమర్శించారు. ఈ కోడ్ ల వల్ల పెట్టుబడు దారులకు లాభం జరిగి కార్మికులు జీవిత కాలం శ్రమ దోపిడీ కి గురైతారని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారం లో కి వచ్చి రొండున్నారా సంవత్సరాలు గడుస్తున్నపటికి ఎన్నికల ముందు కార్మికుల కు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి, కార్మికుల సమస్య లు పరిష్కరిచడం లో విఫలం అయ్యారని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్మికుల కు పిలపునిచ్చారు.ఈ కార్యక్రమం లో భవన నిర్మాణకార్మిక సంగం జిల్లా ఉపా ధ్యక్షులు రాధారపు. మల్లేశ,రాంనర్సయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.