Header
05 Nov 2026 | 07:45 PM

ఈనెల 7న జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలి- బొలుగుల

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 5 వలిగొండ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఈనెల 7వ తేదీన వలిగొండ మండలం కేంద్రం నుండి వెళుతున్న సందర్భంగా మండలంలోని బీసీలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు బొలుగుల నరసింహ కోరారు. గురువారం మండల కేంద్రంలో పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా పోరాడి రాజ్యాధికార దిశగా సాగాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీలను అణగదొక్కుతూ కొద్దిమంది ఉన్నత వర్గం వారు రాజ్యాలనేలుతూ బీసీలను ఓటు బ్యాంకు గానే చూస్తూ అవమాన పరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బిసి రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గొలుసుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ రమేష్, వలిగొండ టిప్పర్ అసోసియేషన్ నాయకులు గండికోట శ్రీశైలం, పల్లపు శ్రీశైలం, గండికోట రాజశేఖర్, గండికోట రాజు, ఓర్సు కనకసారయ్య, దుంప శ్రీను, ఓర్సు చందు, దండ్ల వెంకటేశం, దుంప రమేష్, పీట్ల ఐలేష్, దుంప సారయ్య తదితరులు పాల్గొన్నారు.