రుద్రూర్, మే 30 (అక్షర ఆయుధం న్యూస్) : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. వివోఏలకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జీఓ 58ను సవరించి,వివోఏలకు రూ.20 లక్షల వరకు సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సమ్మెలో అధ్యక్షురాలు జరిన, ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్, కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.