Header
05 Nov 2026 | 03:47 PM

గుర్తుతెలియని స్థితిలో లభించిన వృద్ధుడి మృతదేహం గుర్తింపు*

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 14 వలిగొండ*వలిగొండ మండల పరిధిలోని కేర్చిపల్లి గ్రామ శివారులో బండారి జంగయ్యకు చెందిన వ్యవసాయ భూమిలో 14.10.2026 తేదీన ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో ఒక వృద్ధుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందంగా విచారణలో, పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన దుబ్బ పెంటయ్య (70) అనే వృద్ధుడు 02.10.2026 తేదీన ఉదయం సుమారు 03:00 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి చిన్న కుమారుడు దుబ్బ భాస్కర్, మృతదేహాన్ని తన తండ్రి దుబ్బ పెంటయ్యగా గుర్తించాడు. ఈ ఘటనపై కేసును సెక్షన్ 194 BNSS కింద మార్చి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి స్పాట్ పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు.