05 Jul 2026 | 02:37 PM

ప్రభుత్వ పాఠశాలలో విద్య బంగారు భవిష్యత్తుకు పునాది

మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్

వలిగొండ జూన్ 11 అక్షరం ఆయుధం రిపోర్టర్ మారగోని శ్రీనివాస్ గౌడ్*ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు బంగారు పునాదులు వేస్తాయని స్థానిక మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్ అన్నారు. గురువారం మల్లేపల్లి వలిగొండ ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందం చే ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో నే నాణ్యమైన విద్య అందించబడుతుందని , పిల్లల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని కాబట్టి మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి చదువు చెప్పే బాధ్యత మాది అని తెలియజేశారు,మీ పిల్లల బంగారు భవిష్యత్ కు మేము భరోసా ఇస్తున్నామని కాబట్టి మీరు మాకు సహకరించి మీ పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దే బాధ్యతను మాకు అప్పగించి ఒక్క అవకాశం మాకు ఇవ్వాలని మేమేంటో నిరూపించు కుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జయమ్మ , గ్రామ పెద్దలు సుంకోజు చంద్రమౌళి , వార్డు మెంబర్ పల్లెర్ల లక్ష్మయ్య, ఉపాధ్యాయులు శ్రీ పోలెపాక నాగేందర్, ముక్కాముల మల్లేశం,శ్రీమతి చంద్రకళ గారు,గులాం జిలాని,శ్రీమతి శారద,పరాంకుశం కిరణ్ అంగన్వాడీ టీచర్ పల్లెర్ల నిర్మల గారు ,గ్రామ పెద్దలు రేగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper