05 Jul 2026 | 02:34 PM

గండేపల్లి మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా గండేపల్లి జూన్ 22: గండేపల్లి మండలంలో సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గ్రంధి సుబ్రమణ్యం భార్య మహాలక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, మురారి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు గురజాల వెంకన్న దొర తండ్రి కృష్ణ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, అదే గ్రామానికి చెందిన చంద్రాల మల్లేశ్వరరావు అత్తగారి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, క్లస్టర్ ఇంచార్జి జాస్తి వసంత్, సుంకవిల్లి రాజు, సొసైటీ చైర్మన్ దిడ్డి శ్రీను, కాటేపల్లి భద్రం, గద్దె అబ్బన్న, ఉండవల్లి బుల్లయ్య, చంద్రాల పెద్ద వెంకన్న, జాస్తి రాధాకృష్ణ, కొల్లు త్రిమూర్తులు, తలారి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper