05 Jul 2026 | 02:37 PM

గల్లా రాము పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూభూపతిపాలెం గురుకుల పాఠశాల విజయాలపై ప్రశంసలు

గోకవరం, జూన్ 30: అక్షర ఆయుధం ప్రతినితి గోకవరం మండలం గాదేలపాలెం గ్రామానికి చెందిన జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షుడు, భూపతిపాలెం గురుకుల పాఠశాల చైర్మన్ గల్లా రామచంద్రరావు రాము పుట్టినరోజు వేడుకలను కొవ్వూరు వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భూపతిపాలెం గురుకుల పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి రాము చేస్తున్న కృషిని నెహ్రూ ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాల పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం, ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడం, వరుసగా ప్రతిభా అవార్డులు అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన విద్య, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రాము నిబద్ధత అందరికీ స్ఫూర్తి" అని నెహ్రూ అన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ గురుకుల పాఠశాల కొత్త ఒరవడి సృష్టిస్తోంది.విలువలతో కూడిన నాయకత్వం ద్వారా గురుకుల పాఠశాల రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని నెహ్రూ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉంగరాల గణేష్, జనసేన నాయకులు గంటా తేజ పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper