05 Jul 2026 | 01:45 PM

ఫ్రీ ఫ్రైమరీ పాఠశాలల్లో బోధనకు మహిళా అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం

వలిగొండ జూన్ 9 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ ; మండల పరిధిలోని 4 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ తరగతుల బోధనకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రాథమిక పాఠశాల బీసీ.కాలని వలిగొండ, ప్రాథమిక పాఠశాల అరూర్, ప్రాథమిక పాఠశాల పహిల్వాన్ పురం, ప్రాథమిక పాఠశాల సంగెం లో ఈ విద్యా సంవత్సరం ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. టీచర్ పోస్టు కు ఇంటర్, ఆయా పోస్ట్ కు 7వ తరగతి విద్య అర్హతతో పాటు 18 నుండి 44 సం||రాల వయస్సు కల్గి ఉండాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ, ST, BC లకు 5 సం॥రాలు, దివ్యాంగులకు 10 సం॥రాల వయోసడలింపు ఉంటుందని ఆయన తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు తమ దృవీకరణ పత్రాలను ఈ నెల 16 లోగా స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

🌐 Select Language:
📰 ePaper