వలిగొండ జూన్ 17 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : మండల పరిధిలోని టేకుల సోమవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థులు చదవడం రాయడం మెరుగుపరచాలని విద్యార్థులు అన్ని రంగాలలో ముందు వరుసలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదేవిధంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్యను పెంచుకునే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యతతో కూడుకున్న భోజనాన్ని అందించాలని మెనూ ఖచ్చితంగా పాటించాలని పాఠశాల ఆవరణ అదేవిధంగా తరగతి గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.