అక్షర ఆయుధం న్యూస్, జూన్ 13, ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం (వి. బన్సిలాల్): వైరా నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. "డయల్ యువర్ వైరా ఎమ్మెల్యే" పేరుతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాల ను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం జూన్ 14, ఆదివారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ సమయంలో ప్రజలు 8520914577 నంబర్‌కు కాల్ చేసి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌తో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించవచ్చు.ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధి ప్రత్యక్షంగా అందుబాటులో ఉండడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ అవకాశాన్ని వైరా నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.గమనిక: జూన్ 14న ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి.