వలిగొండ జులై 1 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : మండలంలోని రైతాంగానికి సాగు నీరు అందించే ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి ఈ నెల 10 తేదీ వరకు నీటిని విడుదల చేయాలి లేదంటే ఈనెల 11వ తేదీన రైతాంగంతో కలిసి కాలువ నీటిని మేమే విడుదల చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ లు అన్నారు. బుధవారం మండల పరిధిలోని గోకారం గ్రామంలో ధర్మారెడ్డి పల్లి కాలువ వద్ద రైతాంగంతో కలిసి కాల్వపనుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాజయ్య సురేందర్ లు మాట్లాడుతూ ధర్మారెడ్డి పెళ్లి కాలువ పనులను పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూన్ ఒకటో తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పినా నీటిపారుదల శాఖ అధికారులు,కాంట్రాక్టర్ పనులను నత్తనడకన చేయటం మూలంగా నేటికీ రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. ధర్మారెడ్డి పెళ్లి కాలువ కింద సాగుఅవుతున్న అనేక గ్రామాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని మళ్లీ ఈ పంట కూడా పోతే రైతులు చాలా నష్టపోతారని అన్నారు. గత నెల ఒకటో తేదీన గోకారం గ్రామానికి వచ్చినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు జులై ఒకటో తేదీ వరకు కచ్చితంగా నీళ్లు ఇస్తామని చెప్పి నేడు నీళ్లు ఇవ్వకపోవడం చాలా దారుణం అని అన్నారు. రైతాంగానికి ఈ సీజన్లో అనువైన కాలం పోతుందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,నీటిపారుదల శాఖ అధికారులు జోక్యం తీసుకొని కాంట్రాక్టర్ తో మాట్లాడి రాత్రింబవళ్లు పనులు నిర్వహించి ఈ నెల 10వ తేదీ వరకు రైతాంగానికి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ధర్మారెడ్డి పెళ్లి కాలువ సాగుఅవుతున్న గ్రామాల్లోని రైతులను ఐక్యం చేసి ఈనెల 11వ తేదీన వీరందరితో కలిసి నీటిని విడుదల చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కవిడే సురేష్,సిపిఎం నాయకులు పబ్బు నారాయణ,నారి రామస్వామి,పబ్బు యాదగిరి,రావుల ఈశ్వరయ్య, తూర్పునూరు శంకరయ్య,స్థానిక వార్డు మెంబర్లు చరక శ్రీను,వీరమల్ల శ్రీకాంత్ నాయకులు దేశపాక రవి,శనిగారపు పాండు,కొమ్ము ముత్యాలు, కొమ్ము అంజయ్య,ఆనగంటి కనకయ్య,ఎరువ వెంకటేశం,అనగంటి కనకయ్య,కొమ్మగాని అంజయ్య, నారి యాదయ్య, పబ్బు మల్లేష్, పాలకూర్ల మల్లయ్య,బుడిగె ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.