వలిగొండ జూన్ 29 అక్షర అయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్*భువనగిరి చిట్యాల నాలుగు లైన్లు రోడ్డుకు 239.75 కోట్ల నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు కుంభం కుమార్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. భువనగిరి చిట్యాల నాలుగు లైన్ల రోడ్డు వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఆయన అన్నారు.