05 Jul 2026 | 03:25 PM

శోధన ఫార్మా పరిశ్రమపై సమగ్ర విచారణ చేయాలిగని శెట్టి డిమాండ్

అక్షర ఆయుధం న్యూస్: పరవాడ:రిపోర్టర్ ఆర్కే (జూన్6) అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ ఫార్మా సిటీలో శోధన ఫార్మా పరిశ్రమంలో డ్యూటీ చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గం:లకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో గుండె పోటుతో కార్మికుడు అస్వస్థతకు గురైనట్లు యాజమాన్యం చెప్తుండగా కార్మికులు అస్వస్థతకి కారణం తెలియరాలేదని వెంటనే విచారణ చేసి చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.శనివారం ఆయన పరిశ్రమ వద్ద వివరాలను సేకరించారు.బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు మృతి చెందడం పట్ల సమగ్ర విచారణ చేసి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper